భారతదేశం, ఏప్రిల్ 28 -- OTT: నట్టి నటించిన తమిళ పొలిటికల్ డ్రామా 'TN 2026' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. కేవలం ఒకే ఓటీటీలో కాకుండా ఏకంగా ఐదు వేర్వేరు ఓటీటీ వేదికల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తమిళ పొలిటికల్ థ్రిల్లర్ 'TN 2026: తంగ నచ్చత్తిరమ్' అంచనాలను మించి చాలా త్వరగానే ఓటీటీ బాట పట్టింది. ఈ నెల ప్రారంభంలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. సరిగ్గా 20 రోజుల వ్యవధిలోనే అంటే ఏప్రిల్ 30న డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. సాధారణంగా సినిమాల డిజిటల్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు భారీ పోటీ పడుతుంటాయి. అయితే ఈ చిత్ర నిర్మాతలు మాత్రం ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌కు వెళ్లకుండా వినూత్నమైన వ్యూహాన్ని అనుసరించారు.

సాధారణంగా ఏదైనా సినిమా అమెజాన్ ప్రైమ్ లేదా ఆహా వంటి ఒకే వేదికపై వస్తుంది. కానీ 'TN 2026' ఏకంగా ఐదు వే...