భారతదేశం, మార్చి 31 -- ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ 'చిరాయా' హాట్ టాపిక్ గా మారింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో పెళ్లయిన తర్వాత ఆ మగాడు.. తన భార్య అనుమతి లేకుండానే రాక్షసుడిలా మీద పడి శృంగారం చేస్తుంటాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టింది.

తాజాగా ఈ సిరీస్ లోని ఓ సీన్ కు సంబంధించి మంచంపై నిస్సహాయంగా పడి ఉన్న అమ్మాయి ఫొటోను మోడల్ నేత్ర శర్మ ఎక్స్ లో పోస్టు చేసింది. దీనికి ఆమె రాసిన క్యాప్షన్ వైరల్ గా మారింది.

''చిరాయాలోని ఈ సీన్ తో తప్పు లేదని చెప్పే మగవాళ్లకు అమ్మాయి శరీరం గురించి కనీస అవగాహన లేదు. అంగీకారం, ప్రేరణ లేకుండా, లుబ్రికేషన్ వాడకుండా చేసే బలవంతపు సెక్స్ కారణంగా యోని చిరుగుతుంది. ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్...