భారతదేశం, జూలై 2 -- OTT: ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే.. అది 'గుర్తుకొస్తున్నాయి' సిరీసే. ఇంకా ఓటీటీలో రిలీజ్ కాని ఈ సిరీస్ గురించి ట్విటర్ లో మోత మోగుతోంది. ఎక్స్ లో అందరూ పాజిటివ్ రివ్యూస్ తో ఈ సిరీస్ పై హైప్ ను మరింత పెంచేస్తున్నారు. ఇది ప్యూర్ నోస్టాల్జియా మూమెంట్ అని అందరూ అంటున్నారు.

సింపుల్ కథలనే మనసులకు హత్తుకునేలా తీస్తూ ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ బ్లాక్ బస్టర్లు కొడుతోంది. '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్', 'అనగనగా' అలాంటి కథలే. ఇప్పుడు ఇదే కోవలో 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ వచ్చేస్తోంది. ఈ నోస్టాల్జియా సిరీస్ రేపటి (జూలై 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగానే థియేటర్లలో వేసిన ఈ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది.

కొన్ని సినిమాలు లేదా సిరీస...