భారతదేశం, జూలై 8 -- OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సైలెంట్ గా ల్యాండైంది బాలీవుడ్ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ 'డుగ్ డుగ్' (Dug Dug). ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు మైండ్ బ్లాంక్ స్టోరీతో షాక్ ఇస్తోంది. డెబ్యూ డైరెక్టర్ రిత్విక్ పరీక్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే, వాసన్ బాలా లాంటి ఇండియాస్ టాప్ మోస్ట్ కల్ట్ ఫిల్మ్ మేకర్స్ సపోర్ట్ తోడవడంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది. రాజస్థాన్ లోని ఫేమస్ 'బుల్లెట్ బాబా' రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ కథను చాలా విచిత్రంగా డిజైన్ చేశారు.

మే 8న థియేటర్లలో రిలీజైన ఈ డుగ్ డుగ్ మూవీని బుధవారం (జులై 8) నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తోంది. ఒక పాత లూనా మోపెడ్ బైక్ చుట్టూ జనాలు గుడ్డి నమ్మకాన్ని ఎలా పెంచుకున్నారు.. ...