భారతదేశం, ఆగస్టు 19 -- OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మన మూడ్‌కు తగ్గ సరైన సినిమాను ఎంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. స్క్రీన్ పై గంటల తరబడి స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసే బదులు, మిమ్మల్ని స్క్రీన్‌కు హత్తుకుపోయేలా చేసే కొన్ని అద్భుతమైన చిత్రాలను చూడటం ఎంతో మేలు. ప్రముఖ ఓటీటీ 'జీ5' (ZEE5) లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏడు టాప్ మూవీస్ ఏంటో ఇక్కడ చూసేయండి.

2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి నేపథ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్ (విక్కీ కౌశల్) అనే ఆర్మీ ఆఫీసర్.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి సంరక్షణ కోసం డెస్క్ జాబ్ తీసుకుంటాడు. అయితే, ఉరిలోని ఆర్మీ బేస్‌పై పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు దాడి చేసి, విహాన్ బావమరిదితో సహా 19 మంది సైనికులను దారుణంగా హత్య చేస్తారు.

ఈ ఘటనతో రగిలి...