భారతదేశం, సెప్టెంబర్ 8 -- OTT: ఇండియాలో ఓటీటీ వినోద రంగం ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' (Ormax Media) వెల్లడించిన లేటెస్ట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ సంఖ్య ఏకంగా 11 శాతం పెరిగి 665 మిలియన్లకు (66.5 కోట్లు) చేరుకుంది. మనదేశంలో డిజిటల్ కంటెంట్ వినియోగం ఎంత వేగంగా విస్తరిస్తుందో ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.

ఈ ఆర్మాక్స్ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కనెక్టెడ్ టీవీ (Connected TV / CTV) యూజర్ల సంఖ్య ఏకంగా 60 శాతం పెరగడం. ఒకప్పుడు కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన ఓటీటీ వినోదం.. ఇప్పుడు నేరుగా ఇళ్లలోని లివింగ్ రూమ్‌లకు చేరింది.

స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ప్రజలు కేబుల్ టీవీ,...