భారతదేశం, మార్చి 28 -- వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఏం చూద్దామా అని సెర్చ్ చేస్తున్నారా? మీ కోసమే ఈ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లిస్ట్. జియోహాట్‌స్టార్‌లో అదరగొడుతున్న ఈ నాలుగు వెబ్ సిరీస్ లపై లుక్కేయండి. ఇందులో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లున్నాయి. ఈ వీకెండ్ కు ఇవి బెస్ట్.

జియోహాట్‌స్టార్‌ ఓటీటీ తెలుగులో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా నాలుగు వెబ్ సిరీస్ లే ఉన్నాయి. అవే.. 'విక్రమ్ ఆన్ డ్యూటీ', 'కాట్టాన్', 'రిసార్ట్', 'చిరాయా'. ఈ వెబ్ సిరీస్ లు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి.

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. ఇదో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ లో ఒ...