భారతదేశం, జనవరి 21 -- టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah Patel) ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా ఇంకా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. వరుసగా చిన్న సినిమాలు చేస్తున్న ఆమె.. ఈ మధ్యే 'మారియో' (Mario) అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది.

హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన మూవీ మారియో. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' దక్కించుకుంది. ఇప్పుడీ సినిమాను ఆ ఓటీటీ డిజిటల్ ప్రీమియర్ చేయబోతోంది. ఈ శుక్రవారం అంటే జనవరి 23 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. "రెడ్ హాట్ అలెర్ట్. టర్బో ఛార్జ్డ్, ర్యాంప్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.. మారియో జనవరి ...