భారతదేశం, నవంబర్ 12 -- OTT: ఓటీటీలోకి రూ.23 వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వచ్చేస్తోంది. ఈ ఏడాది జులైలో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. నవంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీ (IMDb)లో 7.9/10 రేటింగ్ సాధించిన ఈ సినిమా స్టోరీ, విశేషాలు ఇక్కడ చూద్దాం.

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సంఘటనల తర్వాత నాలుగేళ్లకు ఈ సినిమా కథ మొదలవుతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జ్ఞాపకాల నుంచి తన ఉనికిని స్వచ్ఛందంగా చెరిపేసుకున్న పీటర్ పార్కర్ (టామ్ హాలండ్), న్యూయార్క్ నగరంలో పూర్తిస్థాయి స్ట్రీట్-లెవల్ స్పైడర్ మ్యాన్‌గా ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.

ఆప్తులు దూరమైన బాధ, ఒంటరితనం, ఒత్తిడి కారణంగా పీటర్ శరీరంలో ఊహించని మా...