భారతదేశం, జూలై 24 -- OTT: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'నిలావుక్కు ఎన్మేల్ ఎన్నడి కోబమ్' (NEEK) చిత్రంతో నటుడిగా పరిచయమైన పవిష్.. హీరోగా నటించిన రెండవ చిత్రం 'లవ్ ఓ లవ్'. మహేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ద్వారా తెలుగు డిజిటల్ స్పేస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో ఫోక్ సాంగ్స్ లో డ్యాన్స్ తో బాగా పాపులర్ అయిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తెలుగులో 'ఇడుపు కాయితం' అనే సినిమా చేస్తోంది. అయితే ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇప్పటికే తమిళంలో 'లవ్ ఓ లవ్' అనే మూవీ చేసింది. ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

పవిష్, నాగదుర్గ జంటగా నటించిన లవ్ ఓ లవ్ మూవీ 21 రోజులకే ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం జ...