భారతదేశం, జూలై 17 -- OTT: రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్ డ్రామా 'ధురంధర్' ఓటీటీలో ఊచకోత కోస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక వివాదాస్పద కమెడియన్ గ్రాండ్ కంబ్యాక్ షో ఇండియన్ స్ట్రీమింగ్ హిస్టరీలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' రిలీజ్ చేసిన 2026 హాఫ్ ఇయర్లీ ఓటీటీ రిపోర్ట్‌లో సమయ్ రైనా ప్రెజెంట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

2026 జనవరి నుంచి జూన్ వరకు ఇండియా వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యధికంగా చూసిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ఆర్మాక్స్ మీడియా 'ది ఇండియా ఓటీటీ వాచ్‌లిస్ట్' పేరుతో వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం సమయ్ రైనా రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్ 2' ఏకంగా 3.85 కోట్ల (38.5 మిలియన్) వ్యూయర్‌షిప్‌తో ఇండియాలోనే నంబర్ 1 ఓటీటీ ప్రాజ...