భారతదేశం, మే 1 -- OTT: ఇటీవల కాలంలో వివాదాలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సినిమా 'ది కేరళ స్టోరీ 2'. ఈ మూవీ రిలీజ్ కు ముందే కాంట్రవర్సీ తలెత్తింది. ఇక విడుదల తర్వాత మరింత వివాదాస్పదంగా మారింది. థియేటర్లలో ఈ మూవీ షోలను అడ్డుకున్నారు. హైకోర్టులో కేసు కూడా నడిచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సూపర్ హిట్ గా నిలిచిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే 'ది కేరళ స్టోరీ 2'. ఈ కాంట్రవర్శియల్ సినిమా శుక్రవారం (మే 1) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేడే ఓటీటీలో అడుగుపెట్టింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒరిజినల్ గా హిందీలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' మూవీ తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు తో పాటు మరో మూడు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తమిళ్, మలయాళం...