భారతదేశం, జనవరి 20 -- యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినిమా 'దండోరా' తెగ నచ్చేసింది. ఈ మూవీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంకేముంది.. దండోరా మూవీ పేరు తెగ వైరల్ గా మారింది. దెబ్బకు సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో టాప్-2లోకి దూసుకెళ్లింది. మీరు ఈ మూవీని చూశారా మరి!

దండోరా సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. మూవీ అద్భుతంగా ఉందంటూ తారక్ ప్రశంసలు కురిపించాడు. ''ఇప్పుడే దండోరా చూశా. లోతుగా ఆలోచింపచేసే, పవర్ ఫుల్ మూవీ. శివాజీ గారు, నవదీప్, నందు, ర‌వి కృష్ణ‌, బిందు మాధవి అసాధారణ ప్రదర్శన చేశారు.

బలమైన రైటింగ్ కు, ఇలాంటి స్టోరీని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినందుకు డైరెక్టర్ మురళీకాంత్ కు హ్యాట్సాఫ్. ఈ ప్రయత్నానికి అండగా నిలిచిన రవీంద్ర బెనర్జీకి కుడోస్. అద్భుతమైన మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు'' అని ఎన్టీఆర్ ట్వీట...