భారతదేశం, మార్చి 16 -- ప్రపంచంలో సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ ను అందుకోవాలని కల కంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ మళ్లీ వచ్చేసింది. ఆస్కార్స్ 2026 ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 98వ అకాడమీ అవార్డుల విన్నర్స్ ఎవరూ అనేది ఉత్కంఠగా మారింది.

ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఆస్కార్స్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 98 వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన వివిధ క్రాఫ్టల్లో సత్తాచాటిన వాళ్లకు అవార్డులు అందజేస్తున్నారు.

ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ఇప్పటివరకూ కొంతమంది విజేతలను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ ...