భారతదేశం, జూన్ 22 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒప్పో సంస్థ ఒక అదిరిపోయే వార్త చెప్పింది. గత నెలలో చైనా మార్కెట్లో విడుదల చేసిన తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'ఒప్పో రెనో 16'ని త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో మోడళ్లను కంపెనీ దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్ల రాకను అధికారికంగా ఖరారు చేస్తూ ఒప్పో ఇండియా సాషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

భారతదేశంలో ఈ స్మార్ట్​ఫోన్ల విక్రయాల కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ప్రత్యేక మైక్రోసైట్లు ఇప్పటికే లైవ్ అయ్యాయి. చైనాలో ఈ ఫోన్లతో పాటు లాంచ్ చేసిన ఒప్పో ఎన్కో ఎయిర్ 5ఎస్ ఇయర్‌బడ్స్, సరికొత్త ఒప్పో బబుల్ యాక్సెసరీని కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజర్ల ద్...