భారతదేశం, జూలై 28 -- ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ప్రధానంగా చూసే ఫీచర్స్​లో బ్యాటరీ బ్యాకప్ ఒకటి! రోజుకు రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు పనిచేసే ఫోన్ల కోసం వినియోగదారులకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒప్పో' స్మార్ట్​ఫోన్ లవర్స్​కి గుడ్ న్యూస్ చెప్పింది. చైనా మార్కెట్లో త్వరలోనే లాంచ్ కానున్న తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఏ7 ప్రొ మ్యాక్స్' టీజర్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీనే! ఏకంగా 10,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ రాబోతోందని ఒప్పో ధృవీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ పిక్‌ను కూడా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ 'వీబో'లో పంచుకుంది.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒ...