భారతదేశం, సెప్టెంబర్ 19 -- పండుగ సీజన్ సందర్భంగా వన్​ప్లస్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలవుతాయి. కొనుగోలుదారులు వీటిని వన్​ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి స్టోర్ల నుంచి పొందవచ్చు.

వన్​ప్లస్ 13:

ఈ ఏడాది ప్రారంభంలో రూ. 69,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన వన్​ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్, ఈ పండుగ సీజన్‌లో రూ. 61,999 కి లభిస్తుంది. అంతేకాకుండా, దీనిపై రూ. 4,250 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర రూ. 57,749 కి తగ్గుతుంది.

వన్​ప్లస్ 13ఆర్:

రూ. 42,999 కి లాంచ్ అయిన వన్​ప్లస్ 13ఆర్, డిస్కౌంట్‌తో రూ. 37,999 కి లభిస్తుంది. దీనిపై రూ...