భారతదేశం, ఆగస్టు 29 -- భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విపణిలో తన శక్తిని పెంచుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక అడుగు వేసింది. సంపూర్ణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన 'భారత్ సెల్' ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో సరికొత్త ఎంట్రీ లెవెల్ స్కూటర్ సిరీస్ 'ఓలా S1Z'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆకట్టుకునే డిజైన్, మైండ్ బ్లోయింగ్ రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 79,999గా నిర్ణయించారు.

కొత్త ఓలా ఎస్1జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు విభిన్న బ్యాటరీ సామర్థ్యాలతో లభిస్తుంది:

3.1 kWh వేరియంట్: ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల (IDC) రేంజ్ ఇస్తుంది.

5.1 kWh వేరియంట్: ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999. ఇది గరిష్టంగా 301 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ...