భారతదేశం, మే 7 -- మనం పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు.. అది మన జీవిత గమనాన్ని, స్వభావాన్ని, కెరీర్‌ను నిర్దేశించే ఒక శక్తివంతమైన సంకేతం అని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. సంఖ్యాశాస్త్రంలో ఒక్కో అంకెకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిలో అత్యంత శక్తివంతమైనది 'నెంబర్ 1'. ఏ నెలలోనైనా సరే 1, 10, 19 లేదా 28వ తేదీల్లో జన్మించిన వారిని మూలాంకం 1 వ్యక్తులుగా పరిగణిస్తారు. వీరిపై గ్రహరాజు సూర్యుడి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సూర్యుడు అంటేనే తేజస్సు, ఆత్మవిశ్వాసం, అధికారం. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కడ ఉన్నా సరే, తమదైన ముద్ర వేస్తుంటారు.

మూలాంకం 1 వ్యక్తులకు నాయకత్వం వహించడం అనేది నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. వీరు ఎప్పుడూ గుంపులో గోవిందలా ఉండటానికి ఇష్టపడరు. పది మందికి దారి చూపే నాయకుడిలా ఉండటానికే మొగ్గు చూపుతారు. కార్యాలయంల...