భారతదేశం, మే 18 -- NTRNeel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫస్ట్ గ్లింప్స్'కు ముహూర్తం ఖరారైంది. తారక్ పుట్టినరోజు పురస్కరించుకుని, ఒక రోజు ముందే బర్త్ డే ట్రీట్ అందించాలని మేకర్స్ నిర్ణయించారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే . ఒక రోజు ముందు అంటే మే 19వ తేదీ రాత్రి సరిగ్గా 11:52 గంటలకు ఈ భారీ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు 'ఎన్టీఆర్‌నీల్ ఫిల్మ్' (NTRNeelFilm) అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న వివరాలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

భారతదేశ భౌగోళిక కేంద్ర బిందువైన నాగ్‌పూర్ పరిసర ప్రాంతాల కోఆర్డినేట్స్‌ను షే...