భారతదేశం, ఏప్రిల్ 29 -- NTR Adavi Ramudu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'రికార్డుల వేట' అంటే గుర్తొచ్చే మొదటి సినిమా 'అడవి రాముడు'. నటరత్న నందమూరి తారక రామారావు (NTR) కథానాయకుడిగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 1977లో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 28నాటికి 49 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దర్శకేంద్రుడు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు అప్పటి వసూళ్లు ఇప్పటి 10 బాహుబలిలతో సమానం అంటూ ఆక్ష్న పోల్చిన తీరు ఆకట్టుకుంటోంది.

"అడవి రాముడు సినిమా వచ్చి 49 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఇది నిన్నకాక మొన్న జరిగినట్లుగానే ఉంది" అంటూ రాఘవేంద్రరావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా కేవలం విజయాన్ని మాత్రమే కాకుండా, జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలను, అనుబంధాలను ప్రసాదించిందన...