భారతదేశం, నవంబర్ 25 -- Not A Mahatma Docu Series: తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల బలిదానాలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తదితర విషయాలో ఓ డాక్యుమెంట్ సిరీస్ రాబోతుంది. 'నాట్ ఏ మహాత్మ' (Not A Mahatma) అనే టైటిల్ ఈ డాక్యు సిరీస్ ట్రైలర్ ను ఇవాళ (నవంబర్ 25) రిలీజ్ చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, ఉద్యోగుల పోరాటాలు, రాజకీయ పార్టీల నిర్ణయాలను నాట్ ఏ మహాత్మ ట్రైలర్ ప్రారంభంలో ఎంతో బలంగా చూపించారు. ఓయూ గడ్డపై విద్యార్థుల నినాదాలు, బతుకమ్మ సంబరాలు, బోనాల కోలాహలం, కొలువులను తాకట్టు పెట్టి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదనను దృశ్యరూపంలో కళ్లకు కట్టారు.

ఉద్యమంలో ఎందరో భాగస్వాములైనా, రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణం మాత్రం ఒకే ఒక్క దీక్ష అనే కోణంలో ట్రైలర్ మలుపు తిరుగుతుంది. "కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడ...