భారతదేశం, మార్చి 18 -- కన్నడ పాన్ ఇండియా సినిమా 'కేడీ ద డెవిల్' (KD: The Devil) లోని 'సర్కే చునర్' (Sarke Chunar) ఐటెమ్ సాంగ్ రేపిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆ పాటలో వాడిన పచ్చి బూతులపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏకంగా పార్లమెంట్‌లో కూడా దీనిపై చర్చ జరగడం, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఆ పాటను బ్యాన్ చేస్తామని హామీ ఇవ్వడం లాంటివి జరిగాయి.

ఈ రచ్చ మొత్తం ముదిరిపోవడంతో ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీ, డ్యాన్సర్ నోరా ఫతేహి ఈ ఇష్యూపై నోరు విప్పింది. అసలు ఆ హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అంతా ఆ డైరెక్టర్ ప్రేమ్ చేశాడని అనడం గమనార్హం.

బుధవారం (మార్చి 18) మధ్యాహ్నం నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. ఆ బూతు పాటను బ్యాన్ చేయించిన జనాలకు ఆ...