భారతదేశం, జూలై 12 -- Nolan Odyssey: హాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌కు భారత్ వేదికైంది. ఆస్కార్ విన్నర్ క్రిస్టోఫర్ నోలన్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక అఫీషియల్ మూవీ ప్రీమియర్ కోసం ముంబై వచ్చాడు. అతనితో పాటు మార్వెల్ 'స్పైడర్ మ్యాన్' టామ్ హాలండ్, ఆస్కార్ విజేత మాట్ డామన్, ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ ముంబై ఈవెంట్‌లో మెరిశారు.

'ది ఒడిస్సీ' మూవీని సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100% పూర్తిగా IMAX ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేశారు. ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఐమాక్స్ స్క్రీన్లకు, ముఖ్యంగా నోలన్ చిత్రాలకు (గతంలో ఓపెన్‌హైమర్ సాధించిన రికార్డులే నిదర్శనం) విపరీతమైన మార్కెట్ వాల్యూ పెరిగింది.

ముంబై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ రీజియన్లలో ఐమాక్స్ టికెట్ ధరలు రూ.2500 నుండి రూ.3100 వరకు పలుకుతున్నాయి. అయినా ఒడ...