భారతదేశం, సెప్టెంబర్ 7 -- Ninnu Kori September 7 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మాయ అబద్ధాలు ఒకవైపు బట్టబయలు అవుతుంటే.. శాలిని పన్నిన మృత్యు వల విరాట్ మెడకు చుట్టుకోబోతోంది.

ఎలాగైనా బిడ్డతో సహా ఇంట్లోంచి ఉడాయించాలని మాయ, మందర ఒక కట్టుకథ అల్లారు. మందర అర్జెంట్‌గా ఊరు వెళ్లాలని నాటకం మొదలుపెట్టగా, అనుమానం వచ్చిన చంద్ర "నేనూ వస్తాను, బస్సు ఎక్కించి వస్తా" అని అనడంతో వారిద్దరికీ చెమటలు పడతాయి.

దొరికిపోతామేమో అన్న భయంలో ఉన్న మాయ, మందరలను శాలిని తన సమయస్ఫూర్తితో కాపాడింది. తాను గచ్చిబౌలి వెళ్తున్నానని, వాళ్లను డ్రాప్ చేస్తానని చెప్పి మాయ, మందరలను బయటకు వెళ్లేలా చేసింది. వెళ్లే ముందు "బిడ్డను జాగ్రత్తగా చూసుకో" అని అమాయకంగా చెప్పిన చంద్రను చూసి, "నీ కన్నబిడ్డను నీకు కాకుండా చేస్తాను" అని మాయ తన మనసుల...