భారతదేశం, సెప్టెంబర్ 16 -- Ninnu Kori September 16 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. విరాట్ కోసం జగదీశ్వరి ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రకళ ఏం చేయాలో అర్థం కాదు. విరాట్ యాక్సిడెంట్, ఫేస్ స్వాప్ విషయం ఇంట్లోవాళ్లకు తెలియకుండా చంద్ర దాచిపెడుతుంది.

భర్తను వెనక్కి తెచ్చుకోవాలనే ఆరాటంలో చంద్ర ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. విరాట్ ప్రస్తుత రూపం మరొకరిదని, ఆ రూపం వెనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని చంద్రకు తెలుసు. అయినా ఆ నిజాన్ని అత్త జగదీశ్వరికి చెప్పకుండా దాచిపెడుతుంది.

"నేను బావ దగ్గరికే వెళ్తున్నాను అత్త. బావని తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడతాను" అని జగదీవ్వరితో చంద్ర ధీమాగా చెబుతుంది. జగదీశ్వరి ఎంత ఆపే ప్రయత్నం చేసినా వినకుండా, అబద్ధం ఆడిన చంద్ర తన ప్రయాణం మొదలెడుతుంది.

సీన్ ఆస్పత్రికి మారగానే అదిరిపోయే ట...