భారతదేశం, మార్చి 9 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో.. తల్లి సునంద ఇంటికి శాలిని వచ్చి కోపంతో గ్లాస్ సీసాను పగలగొడుతుంది. మనం ఆ నీలిమ, ప్రమోద్ లను ఇన్వాల్వ్ చేసి ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేశాం కదా. కానీ అది మర్చిపోయేలా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది. చంద్ర ప్రెగ్నెంట్ అయింది. ఆమెకు ప్రేమ సొంతం అవుతుందని తల్లితో శాలిని చెప్తుంది.

ఏం టెన్షన్ పడకు బేబీ. విరాట్ కు నీలిమ, ప్రమోద్ అడ్డొస్తున్నారు. వాళ్లలో ఒకరిని పైకి పంపించామనుకో అప్పుడు డౌట్ ఎవరి మీదకు వెళ్తుంది? అది విరాట్ చేయించాడని అనుకుంటారు. దొంగ సాక్ష్యాలతో అతనికి శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు ఆ కుటుంబంలో అందరికీ విషాదమేనని సునంద కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. వద్దమ్మా, అప్పుడు మన సీక్రెట్ ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. మనం ఆ ఇంటి పతనం కోరుకుంటున్నామని ఎవరికీ తెలియకూడదు. అలాగే క్రాంత...