భారతదేశం, మార్చి 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో.. వదిన కోసం తెచ్చిన ఫ్రూట్స్ ను చంద్రకళకు క్రాంతి ఇస్తాడు. బొజ్జలో ఉన్న బుజ్జి బాబు కోసం ఈ బాబాయి కూడా ఆలోచిస్తాడని క్రాంతి అంటాడు. జూనియర్ విరాట్ వచ్చాక అందరినీ ఆడిస్తాడని చెప్తాడు. శాలినిపై కోపంతో క్రాంతి లోపలికి వెళ్లిపోతాడు.

క్రాంతి తెచ్చిన ఫ్రూట్స్ ను కామాక్షి తీసుకోబోతుంటే శ్యామల వచ్చి కొడుతుంది. ఈ పళ్లు అన్ని చంద్రకళనే తినాలని శ్యామల చెప్తుంది. మరోవైపు కామాక్షిని బుట్టలో వేసుకునేందుకు మాయ ట్రై చేస్తుంది. పిన్ని గారు అని వరుస పెట్టి పిలుస్తుంది. నాకు రెస్పెక్ట్ ఇస్తున్న ఫస్ట్ పర్సన్ నువ్వేనని కామాక్షి అంటుంది.

క్రాంతి, శాలిని గురించి కామాక్షిని మాయ అడుగుతుంది. ఆ శాలిని మామూలు మనిషి కాదు, మేకవన్నె పులి. మా అన్నయ్య మీద దాడి చేసిందని జరిగింది మొత్తం మాయకు కామాక్షి చ...