భారతదేశం, మార్చి 13 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 13 ఎపిసోడ్ లో.. ఆఫీస్ లో కస్టమర్ తో జల రాజ్ మాట్లాడుతుండగా అక్కడ ఉన్న స్కానర్ పై తన బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ను శ్రుతి అతికిస్తుంది. నా అకౌంట్ క్యూఆర్ కోడ్ అతికించేశాను, ఇక అమౌంట్ మొత్తం నాకే అని శ్రుతి అనుకుంటుంది.

మరోవైపు విరాట్ కు చంద్రకళ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో చూద్దామని ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంటుంది. విరాట్ అప్పుడే వస్తాడు. వెళ్లు బాబు వెళ్లు సర్ ప్రైజ్ గదిలో రెడీగా ఉందని విరాట్ ను రూమ్ కు పంపిస్తారు. చంద్ర ఇచ్చిన ఫొటో ఫ్రేమ్ లో తన చిన్నప్పటి ఫొటో చూసి విరాట్ మురిసిపోతాడు.

నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను లైవ్ లో చూస్తా. నువ్వు లేనప్పుడు ఈ ఫొటో చూస్తా. కడుపుతో ఉన్నప్పుడు ఎవరినైతో ప్రేమతో చూస్తామో వాళ్ల పోలికలు వస్తాయి. నిద్ర పొయేటప్పుడు, లేచ...