భారతదేశం, మార్చి 11 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. జల రాజ్ ట్రావెల్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తాడు. మొదటి పేమెంట్ తన భార్య చేతుల మీదుగా జరగాలని రాజ్ కోరుకుంటాడు. ఆఫీస్ చెయిర్ లో శ్రుతిని కూర్చోబెడతాడు. రూ.20 వేలను ఆన్ లైన్ పేమెంట్ చేయమని కస్టమర్ ను కోరతాడు. నా షేర్ నాకు కావాలని శ్రుతి అడుగుతుంది.

ఆ మనీ అమ్మ అకౌంట్లో పడింది. ఆ అకౌంట్ కు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లాంటివి ఏమీ లేవు. డబ్బులు తీయాలంటే బ్యాంక్ కు వెళ్లి అమ్మ సంతకం చేయాల్సిందేనని రాజ్ చెప్పడంతో శ్రుతి షాక్ అవుతుంది. మరోవైపు మాయను విరాట్ కాపాడటంపై ఫ్యామిలీ ప్రశ్నలు వేస్తుంది. శ్రుతి డ్రెస్ వేసుకుని మాయ బయటకు వస్తుంది.

మాయకు తన ఫ్యామిలీని విరాట్ పరిచయం చేస్తాడు. మాయ నీకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ నీకు మేమున్నామని రఘురాం అడుగుతాడు. మాయ ఏడుస్తూ తన గురించి చె...