భారతదేశం, మే 4 -- Nikhil: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆసుపత్రిలో జరిగిన అమానుషంపై యావత్ భారత్ నిరసనలతో అట్టుడికిపోయింది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. అక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జరిగిన దారుణాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు మర్చిపోలేదని, అలాగే దోషులను వెనకేసుకొచ్చిన వారిని క్షమించలేదని నిఖిల్ అభిప్రాయపడ్డారు.

"పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ ఘటనను మర్చిపోలేదు.. మన్నించలేదు కూడా. సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి వారు సరైన రీతిలో బుద్ధి చెప్పార...