భారతదేశం, ఆగస్టు 19 -- Nidhhi Agerwal: అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ హాట్ బ్యూటీ, ఇటీవల 'ది రాజా సాబ్' సినిమాలో మెరిసిన నిధి అగర్వాల్ బుధవారం (ఆగస్ట్ 19) హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడి) ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల భారీ భద్రత నడుమ ఈడీ కార్యాలయానికి చేరుకున్న నిధి.. ముఖానికి మాస్క్ ధరించి లోపలికి వెళ్లిపోయారు. అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాపర్లతో మాట్లాడేందుకు ఆమె అసలు ఇష్టపడలేదు.

ఈడీ అధికారులు ఆమెను గంటల తరబడి సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ఆమెకు ఎంత మొత్తం ముట్టింది? ఆ లావాదేవీలు ఏ ఖాతాల ద్వారా జరిగాయనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

అక్రమ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీ...