భారతదేశం, డిసెంబర్ 22 -- మరికొన్ని రోజుల్లో 2025 పూర్తవబోతోంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. 2025 బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. 2026ను స్వాగతించడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. 2026 మొదటి రోజు చాలా శుభప్రదమైనది. జ్యోతిష్యపరంగా, హిందూ మతపరంగా కూడా ఇది శుభ దినంగా పరిగణించబడుతోంది. జనవరి 1, 2026 ఎందుకు శుభదినం? ఆ రోజు విశిష్టత ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2026 ప్రారంభ రోజు అనగా న్యూ ఇయర్ నాడు తొమ్మిది శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు శుభత్వాన్ని ఈ తొమ్మిది యోగాలు మరింత పెంచబోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది. మరి జనవరి 1న ఏర్పడే తొమ్మిది శుభయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

జనవరి 1న పుష్య శుక్ల త్రయోదశి వచ్చింది. త్రయోదశి చాలా శుభప్రదమైనది. త్రయోదశి శివుని పూజకు అత్య...