భారతదేశం, నవంబర్ 13 -- Netflix Web Series: భారత ఇతిహాసాలను వెండితెరపై లేదా డిజిటల్ స్క్రీన్‌పై ఆవిష్కరించినప్పుడల్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ప్రస్తుతం థియేటర్లలో రణబీర్ కపూర్ 'రామాయణం' కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వేళ, ఓటీటీలో మహాభారత కథాంశంతో వచ్చిన 'కురుక్షేత్ర' (Kurukshetra) వెబ్ సిరీస్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది ఒక సాధారణ యానిమేటెడ్ షో కాదు. అత్యంత అద్భుతమైన విజువల్స్, కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో రూపొందిన మాస్టర్ పీస్. పాండవులు, కౌరవుల మధ్య 18 రోజుల పాటు జరిగిన భీకర కురుక్షేత్ర సంగ్రామాన్ని 18 ఎపిసోడ్లుగా ఎక్కడా బోర్ కొట్టకుండా, అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సిరీస్ మొదటి భాగం 2025 అక్టోబర్ 10న, రెండో భాగం అక్టోబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి.

'కురుక్షేత్...