భారతదేశం, అక్టోబర్ 7 -- Netflix Web Series: కమెడియన్ నుంచి హీరోగా మారిన 'వైవా' హర్షా చెముడు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Least Eligible Bachelor) డిజిటల్ స్పేస్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అయింది. కొద్దిరోజుల వాయిదా తర్వాత ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 9న ఈటీవీ విన్ (ETV Win) తో పాటు ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఒకేసారి గ్రాండ్‌గా స్ట్రీమింగ్‌కి రాబోతోంది.

సాధారణంగా రీజనల్ కంటెంట్ సినిమాలు ఏదో ఒక ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ 10 ఎపిసోడ్ల ఫన్ రైడ్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ రీజనల్ లవర్స్‌ని పలకరించనుంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీలింగ్వల్ రిలీజ్‌గా రూపుదిద్దుకోవడం ఈ వెబ్ సిరీస్ ప్రత్య...