భారతదేశం, మే 3 -- Netflix Trending: థియేటర్లలోనే కాదు ఇప్పుడు ఓటీటీలోనూ రెండు తెలుగు సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి. గత శుక్రవారం (మే 1) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ రెండు క్రేజీ తెలుగు సినిమాలు ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. యంగ్ హీరోల పోటాపోటీ పోరాటంలో ఒకరు పైచేయి సాధించగా, మరొకరు గట్టి పోటీనిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన సినిమాలు, మళ్లీ అదే రోజు డిజిటల్ తెరపైకి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. శర్వానంద్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'బైకర్', సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ 'రాకాస' సరిగ్గా ఇలాంటి అరుదైన రికార్డునే నమోదు చేశాయి.

ఈ రెండు సినిమాలు గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ చిత్రాలు.. ఇప్పుడు ...