భారతదేశం, జూలై 26 -- Netflix Trending: సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు ఎంతకాలమైనా తమ క్రేజ్‌ను కోల్పోవు. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అందించిన అద్భుతమైన అనుభూతిని దశాబ్దాల తర్వాత కూడా డిజిటల్ వేదికలపై పునరావృతం చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి అరుదైన ఘనతనే సాధించింది ప్రముఖ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మిస్టరీ చిత్రం 'జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్' (Journey 2: The Mysterious Island).

బాక్సాఫీస్ వద్ద విడుదలైన దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జర్నీ 2 ది మిస్టీరియస్ ఐలాండ్ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 2012లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో అదరగొడుతోంది.

ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ చిత్రం కొత్త సినిమాలను సైతం అధ...