భారతదేశం, నవంబర్ 28 -- Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి రోజు ట్రెండింగ్ లిస్ట్ మారుతూనే ఉంటుంది. ఒక శుక్రవారం వచ్చే కొత్త సినిమాలు కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వెంటనే డామినెన్స్ కు తెరతీస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ బ్లాక్ బస్టర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.

అజయ్ దేవగన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి వచ్చిన లాస్ట్ మూవీ దృశ్యం 3 ది కంక్లూజన్. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఏకంగా రూ.589 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఓటీటీలోకి ఇలా వచ్చిందో లేదో వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన ఫస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన...