భారతదేశం, ఆగస్టు 7 -- Netflix Top 10: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా బాక్సాఫీస్ చార్ట్‌లను ఈ వారం రీజనల్ సినిమాలు, హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలు షేక్ చేస్తున్నాయి. విష్ణు విశాల్ 'గట్ట కుస్తీ 2', విభిన్నమైన యాక్షన్ డ్రామా 'కాన్ సిటీ', మాస్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' లాంటి సినిమాలు ఇండియన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

సౌత్ సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్, కామెడీ కంటెంట్‌ను వీకెండ్‌లో చూసేందుకు ఓటీటీ లవర్స్ విపరీతంగా పోటీ పడుతున్నారు.

కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చి థియేటర్లలో నవ్వులు పూయించిన 'గట్ట కుస్తీ'కి సీక్వెల్‌గా రూపొందిన 'గట్ట కుస్తీ 2' ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవ...