భారతదేశం, సెప్టెంబర్ 30 -- Netflix Top 10: డిజిటల్ వినోద ప్రపంచంలో గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం నాటికి ఇండియన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న టాప్ 10 ట్రెండింగ్ షోలు, వెబ్ సిరీస్‌‌ల లిస్ట్ బయటకు వచ్చింది.

కామెడీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, వార్ డ్రామాలతో ఈ వారం నెట్‌ఫ్లిక్స్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మరి ఆ టాప్ 10 ట్రెండింగ్ కంటెంట్ ఏంటో వివరంగా చూద్దాం.

కామెడీ కింగ్ కపిల్ శర్మ తన పాత గ్యాంగ్‌తో కలిసి మళ్లీ వచ్చేశారు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 5' నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది.

నవజోత్ సింగ్ సిద్ధూ, అర్చనా పూరన్ సింగ్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్, కీకు శార్దా తమ కామెడీ టైమింగ్‌తో పొట్టచెక్కలు చేస్తున...