భారతదేశం, అక్టోబర్ 23 -- Netflix Today Releases October 23rd 2026: ఓటీటీలో వీకెండ్ ఏం చూడాలా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం (అక్టోబర్ 23) ప్రేక్షకులకు మంచి కంటెంట్ తీసుకొచ్చింది. అందులోనూ థ్రిల్లర్ అభిమానులకైతే మంచి విందు భోజనమే. మరి ఈరోజు వచ్చిన ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వినూత్న టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు'. సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

తన పెళ్లి రోజే హత్యకు గురయ్యే హీరో, మళ్లీ మళ్లీ అదే రోజు ఉదయానికి చేరుకోవడం, తన చావు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు పుష్కలంగా నవ్వులు, థ్రిల్‌ను పంచుతా...