భారతదేశం, నవంబర్ 24 -- Netflix Releases: ఓటీటీ ప్రియులకు నవంబర్ చివరి వారం అసలైన వినోదాల విందును అందించబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి నవంబర్ 28 వరకు సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, హారర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జాతర కొనసాగనుంది.

బాలీవుడ్ కల్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3', హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', గగుర్పొడిచే హారర్ వెబ్ సిరీస్ 'ఫ్రమ్' (From) సహా మొత్తం 7 క్రేజీ ప్రాజెక్టులు ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ పూర్తి జాబితా, విడుదల తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

నవంబర్ 25 (బుధవారం) నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ కానుంది. స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులకు గురయ్యే ఒక బాలుడు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ఎలా ధైర్యవంతుడిగా మారాడనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ సినిమా రూపొందిం...