భారతదేశం, జూలై 14 -- Netflix OTT: '12th ఫెయిల్' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వర్సటైల్ యాక్టర్ విక్రాంత్ మాస్సే లీడ్ రోల్‌లో వస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామా 'ముసాఫిర్ కేఫే' అఫీషియల్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా రిలీజ్ చేసింది. జులై 24, 2026 నుంచి నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. జీవితంలో ఎదురయ్యే తోటి ప్రయాణికుల ఎమోషన్స్, హార్ట్ బ్రేకింగ్ రిలేషన్ షిప్స్ చుట్టూ ఈ కథ సాగనుంది.

"కొంతమంది తోటి ప్రయాణికులు గమ్యస్థానం వరకు మనతో రారు.. వాళ్లు కేవలం కథలుగా మారి మన జ్ఞాపకాల్లో మిగిలిపోతారు" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ థీమ్‌ను అనౌన్స్ చేసింది. రిలీజ్ అయిన 2 నిమిషాల 18 సెకండ్ల ట్రైలర్ విజువల్స్ చాలా ప్లెజంట్‌గా, క్లాసిక్ లవ్ స్టోరీని తలపిస్తున్నాయి.

నిజానికి ట్రావెలింగ్ బ్య...