భారతదేశం, నవంబర్ 8 -- Netflix Malayalam Thrillers: మలయాళం సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. అక్కడి కంటెంట్ కు మన జనాలు ఫిదా అవుతూనే ఉంటారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్లు అంటే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఆడియన్స్ కోసం అలాంటి టాప్ 5 మూవీస్ లిస్ట్ ఇక్కడుంది. ఇవన్నీ తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇరట్ట నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జోజు జార్జ్ డ్యుయల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో సస్పెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అనుమానస్పద స్థితిలో చనిపోతాడు. అతని కవల సోదరుడే ఆ కేసును ఎంక్వైరీ చేయడానికి వస్తాడు.

పోలీస్ స్టేషన్ లో కథను నడిపించిన తీరు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇరట్ట మూవీని మస్ట్ వాచ్ గా మార్చింది. ఇక క్లైమాక్స్ లో రివీల్ అయ్యే లాస్ట్ 10 నిమిషాల ట్విస్ట్ చూస్తే మ...