భారతదేశం, ఏప్రిల్ 30 -- Netflix Crime Thriller: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మరో పవర్ ఫుల్ పోలీస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కర్తవ్య' (Kartavya) నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 15వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

"డ్యూటీ అనే చక్రవ్యూహంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఒక పరీక్షే" అంటూ మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్ లైన్ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం.

ఒక ఐపీఎస్ అధికారి తన వృత్తిపరమైన బాధ్యతలకు, వ్యవస్థలోని రాజకీయ ఒ...