భారతదేశం, ఆగస్టు 12 -- Netflix: నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఆడియన్స్‌కి క్రేజీ అప్‌డేట్ ఇచ్చేసింది. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా హైప్ తెచ్చుకుంటున్న 'ప్యార్ ప్రేమ కల్యాణం' సినిమా ఆగస్టు 21 నుంచి గ్రాండ్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. లవ్, రొమాన్స్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మేళవింపుగా వస్తున్న ఈ మూవీ 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రియులను పలకరించనుంది.

"ఇది ప్రస్తుతం అమ్మాయి ఇల్లు, త్వరలోనే అబ్బాయి ఇల్లు కూడా కాబోతోంది" అనే క్యాచీ క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో మూవీ ట్రైలర్ షేర్ చేసింది. సుమారు 2 నిమిషాల 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ నెటిజన్లను, డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పెళ్లయిన తర్వాత అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్లడం కామన్. కానీ ఈ ప్యార్ ప్రేమ కల...