భారతదేశం, ఆగస్టు 6 -- Netflix: ఓటీటీ లవర్స్‌కి నెట్‌ఫ్లిక్స్ ఈ శుక్రవారం (ఆగస్టు 7) మైండ్ బ్లాకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమైంది. 1999 కార్గిల్ యుద్ధంలో భారతీయ వాయుసేన (IAF) సాగించిన వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన హై-వోల్టేజ్ మిలిటరీ డ్రామా వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar) ఈ వారం స్పెషల్ అట్రాక్షన్‌గా రాబోతోంది.

దీనితో పాటు దిల్జీత్ దోసాంజ్ పీరియడ్ డ్రామా 'మై వాపస్ ఆవుంగా', తమిళ హీరో అథర్వ మురళి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఇధయమ్ మురళి' కూడా ఒకే రోజు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయబోతున్నాయి.

'అసుర్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓని సేన్ (Oni Sen) ఈ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. 1999లో కార్గిల్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆక్రమణలను తిప్పికొట్టడానికి ఇండ...