భారతదేశం, సెప్టెంబర్ 21 -- దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ పీజీ 2026 ఆన్సర్ కీ విడుదలకు రంగం సిద్ధమైంది! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్) ప్రైమరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు పరీక్షలో నమోదు చేసిన రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉన్నందున, ఏ క్షణంలోనైనా ఈ కీ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షల నిర్వహణలో బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు పరీక్ష సమయంలో ఎంచుకున్న సమాధానాల షీట్లను కూడా తొలిసారిగా బహిర్గతం చేస్తోంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తు...