భారతదేశం, జూలై 9 -- Nayanthara Remuneration: పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్, మలయాళ ఫైర్ బ్రాండ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic). ఈ సినిమా గురించి రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటికొస్తోంది. లేటెస్ట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర, ఆమె తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల నుంచి అందుతున్న పక్కా సమాచారం ప్రకారం, పాన్ ఇండియా యాక్షన్ డ్రామా టాక్సిక్ కోసం నయనతారకు ఏకంగా రూ. 12 కోట్లు చెల్లిస్తున్నారట. ఆమె కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పే చెక్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మేకర్స్ ఆమెను ఈ మూవీ గురించి అడిగినప్పుడు.. నయన్ తన రోల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు డిమాండ్ చేసిందట.

కానీ ప్రొడక్ష...