భారతదేశం, మార్చి 17 -- తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వార్తల్లో నిలుస్తోంది. మహిళల భద్రత కోసం జరిగిన ఒక ర్యాలీలో ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం (C Ve Shanmugam) ఆమెను ఉద్దేశించి చేసిన ఒక కామెంట్ పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై అధికార డీఎంకే పార్టీ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది. విల్లుపురంలో జరిగిన ఒక ఏఐఏడీఎంకే నిరసన కార్యక్రమంలో షణ్ముగం మాట్లాడుతూ.. "నాకు నయనతార కావాలి, నెరవేరుస్తారా? ఎవరికో నయనతారను పెళ్లి చేసుకోవాలని కల ఉంటే, దాన్ని ముఖ్యమంత్రి తీరుస్తారా?" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఎంపీ షణ్ముగం.. నయనతారపై చేసిన ఈ వ్యాఖ్యలను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIAA) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ఎంపీకి డైరెక్ట్‌గా ఒక స్టేట్‌మెంట...